Thursday, 19 Sep, 3.05 pm ఆంధ్రజ్యోతి

ఆంధ్ర తాజా వార్తలు
పర్యాటకం కన్నా మనుసుల ప్రాణాలే ముఖ్యం!

విశాఖపట్నం: రాష్ర్టానికి వచ్చే టూరిస్టులకు రక్షణ కల్పించానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మం త్రి అవంతిశ్రీనివాస్‌ అన్నారు. ఇటీవల గోదావరిలో జరిగిన బోటు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యాటకుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గురువారం విలేకరులతోమాట్లాడిన మంత్రి గోదావరిబోటు ప్రమాదం బాధాకరమైన అంశమని అన్నారు. పర్యాటకం కన్నా మనుష్యుల ప్రాణాలు ముఖ్యమని ఆఆయన స్పష్టంచేశారు. త్వరలో సముద్ర తీరాల్లో హెచ్చరికల బోర్డులుఏర్పాటుచేయడమేకాకుండా లైఫ్‌గార్డులను నియమిస్తామని అన్నారు. ప్రమాద హెచ్చరికలు జారీ చేసే ప్రోటింగ్‌బాయ్స్‌ ఏర్పాటు చేయాలనే నేవీ అధికారుల సలహాను ఆచరణలో పెడతామని తెలిపారు. ఇసుక ఆన్‌లైన్‌ విధానం వలన ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నామని కొందరు నా దృష్టికి తీసుకు వచ్చారని, ఈసమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతామని అన్నారు ఇసుక పాలసీని సమర్దవంతంగా అమలుచేసేవిధంగాచర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఇసుక బ్లాక్‌లో అమ్మేవారిపట్ల కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల విషయంలో ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారని మంత్రి అెవంతిశ్రీనివాస్‌ అన్నారు. గోదావరి ప్రమాదంలో ఆఖరు బాడీ దొరికే వరకూ సహాయక చర్యలు కొనసాగుతాయని వెల్లౄడించారు. బోటు ఓనరుపై కుసులు నమోదయ్యాయని వారు పరారీలో ఉన్నారని అన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top