
వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ వైరస్ విశ్వరూపం చూపుతోంది. ఇక్కడ ఇప్పటికే లక్షపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కంపెనీలకు అమెరికా ప్రభుత్వం ఓ ఆఫర్ ప్రకటించింది. కరోనా లాక్ డౌన్ అమల్లో ఉన్నంతకాలం కాలుష్య చట్టాలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని తెలిపింది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పర్యావరణ చట్టాలను కంపెనీలు పరిగణనలోకి తీసుకోవడం కష్టమని ట్రంప్ సర్కారు అభిప్రాయపడింది. అందుకే ఈ సమయంలో పర్యావరణ చాటాలని ఉల్లంఘించినా ఎటువంటి పెనాల్టీలు వేయబోమని తేల్చిచెప్పింది. ఈ మినహాయింపు ఎంతకాలం అమల్లో ఉంటుందో ఇంకా తెలియలేదు.