Wednesday, 14 Apr, 2.33 am ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
పట్టుబిగిస్తున్న పార్టీలు!

నోటిఫికేషన్‌కు ముందే పొలిటికల్‌ హీట్‌

ప్రధాన పార్టీల అభ్యర్థులంతా గిరిజనేతరులే

పల్లెల్లో మొదలైన ప్రచార సందడి

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌13 (ఆంధ్రజ్యోతి) : ఆదిలాబాద్‌ రూరల్‌ మండల జడ్పీటీసీ ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రధాన పార్టీలలో కదలిక మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అ ధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్ర్తాలను సందించడంతో పొలిటికల్‌ వా ర్‌ మొదలైంది.

బరిలో దింపిన పార్టీలు

రెండు, మూడు నెలల క్రితమే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ లు అభ్యర్థులను ప్రకటించగా, ఇటీవల బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించి ఉపఎన్నికకు సిద్ధమంటూ సవాల్‌ విసురుతుంది. ఇటీవల ఎంపీ సో యంబాపురావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నా యి. ఇక జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగడం ఖాయమని తేలి పోవడంతో ప్ర ధాన పార్టీలు మరింత పట్టుబిగిస్తున్నాయి. అందరి కంటే ముందుగానే అ ధికార పార్టీ అభ్యర్థిని ప్రకటించి గ్రామస్థాయిలో ఇన్‌చార్జిలను నియ మిం చి ముందు వరుసలో నిలుస్తుంది. సానుభూతి, సంక్షేమ పథకాలు, అభి వృద్ధి తమను గెలిపిస్తుందని టీఆర్‌ఎస్‌ భావిస్తుంది. ఆరే.రాజన్న కు మా రుడు నరేష్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అలాగే మోదీ ఈమెజ్‌ యూ త్‌ మద్దతు గిరిజన ఓటర్లే తమను గెలిపిస్తాయంటూ బీజేపీ పాయల శ రత్‌ (బన్నీని)అభ్యర్థిగా ప్రకటించి పక్కాప్లాన్‌తో ముందుకెళ్తుంది. గతంలో జడ్పీటీసీగా పని చేసిన అనుభవం ఉన్న అభ్యర్థి కొండగంగాధర్‌ను బరి లోకి దింపి గెలువాలని కాంగ్రెస్‌ భావిస్తుంది. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలో మేజర్‌ గ్రామ పంచాయతీలైన పొచ్చెర, యాపల్‌గూడ, భీం సారి, చాందా(టి) గ్రామాల్లో పట్టున్న పార్టీలే గెలిచే అవకాశాలు కనిపి స్తున్నాయి. కానీ, ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న పార్టీలు పల్లెల్లో ప్ర చారాన్ని మొదలు పెట్టి సందడి చేస్తున్నాయి.

గిరిజనులను విస్మరించిన పార్టీలు..

ఆదిలాబాద్‌ జడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలన్నీ గిరిజన అభ్య ర్థులను విస్మరించినట్లుగానే కనిపిస్తుంది. మండలంలో గిరిజన ఓటర్ల ప్ర భావం ఎక్కువగానే ఉన్న ఏ ఒక్క పార్టీ వారికి అవకాశం కల్పించక పోవ డంపై గిరిజనులు మండిపడుతున్నారు. ప్రధాన పార్టీలకు తమ సత్తా ఏ మిటో చూపుతామంటూ సవాల్‌ విసురుతున్నారు. ప్రధాన పార్టీల వైఖరి కి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధ మవుతున్నారు. తమ నాయకత్వాన్ని గుర్తించకపోవడం పట్ల ఆదివాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తుడందెబ్బ, ఇతర ఆదివాసీ సంఘాల నేత లు ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొందరు ఆదివాసీ నేతలు రంగంలోకి దిగి ఆదివాసీ సమాజాన్ని ఒకటి చేసే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది.

గ్రామాల్లో పొలిటికల్‌ వార్‌..

ఎన్నికల నోటిఫికేషనే రాలేదు. కానీ, ఉపఎన్నికల్లో గెలిచి సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు ఆరాటపడుతున్నాయి. జడ్పీ వైస్‌చైర్మన్‌ పదవి చేజారిపోకుండా పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నాయి. ఈ ఎన్నికలను సవాలుగా తీసుకొని గెలిచేం దుకు అన్నిరకాల అవకాశాలను అన్వేషిస్తున్నారు. సొంత నియోజకవర్గం కావడంతో మరింత సీరియస్‌గా తీసుకుంటున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. సొంత మండలం కాకపోయినా గెలిచి తీరాలనే పట్టుతో ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ తన కొడుకును జడ్పీటీసీ అభ్యర్థిగా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆదిలాబాద్‌రూరల్‌ మండలంలో మరింత బలపడాలనే ముందు చూపు తో ఉన్నట్లు తెలుస్తుంది. ఆదివాసీ సీనియర్‌ నేత మడావి రాజు జడ్పీటీసీ ఉప ఎన్ని కల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో తన కొడుకును బరిలోకి దింపి టీఆర్‌ఎస్‌, బీజేపీలకు ధీటుగా పోరాడారు. తనను సంప్ర దించకుండానే కాంగ్రెస్‌ అభ్యర్థిని ఖరారు చేయడంపై అసంతృప్తితో ఉ న్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బలమైన నాయకత్వం, క్యాడర్‌ను పొగొట్టుకున్న కాంగ్రెస్‌కు కొత్త ఇబ్బందులు తప్పేలా లేవు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top