Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పేదలను రోడ్ల పైకితెచ్చి బిచ్చగాళ్లుగా మారుస్తారా?: చంద్రబాబు

పేదలను రోడ్ల పైకితెచ్చి బిచ్చగాళ్లుగా మారుస్తారా?: చంద్రబాబు

అమరావతి: రేషన్ కోసం పేదలను రోడ్ల పైకితెచ్చి బిచ్చగాళ్లుగా మారుస్తారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వారంలోనే అందరికీ బియ్యం అందేదన్నారు. ఇప్పుడు నెలకు 10 శాతం మందికి కూడా రేషన్‌ ఇవ్వలేకపోతున్నారని తప్పుబట్టారు. జగన్ ప్రభుత్వం రేషన్ గోనెసంచులను కూడా వదలడం లేదని చంద్రబాబు ఆరోపించారు. జే-ట్యాక్స్ కోసం రేషన్ డీలర్ల వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. కమీషన్ల కోసం వాహనాలను కొని ప్రజలను ఇక్కట్లు పెట్టారని దుయ్యబట్టారు. డీలర్లకు కేజీకి 20 పైసలు ఉన్న కమీషన్‌ను టీడీపీ ప్రభుత్వం వచ్చాక రూపాయికి పెంచిందని తెలిపారు.

కరోనా బారినపడి చనిపోయిన రేషన్ డీలర్లకు రూ.50 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే రేషన్ డీలర్లను కొనసాగిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy