Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్

పెద్దపులి మృతి కేసులో ఇద్దరు అనుమానితుల అరెస్ట్

గుంటూరు, ఆగస్టు 4: మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ డివిజన్, రాచర్ల బీట్‌లో ఉన్న గుండ్లకమ్మ అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గిద్దలూరుకు చెందిన అంజి, నంద్యాల జిల్లాకు చెందిన వీరాంజనేయులును గుంటూరు జిల్లా మేడికొండూరులో అరెస్ట్ చేశారు. ఆపై వారిద్దరినీ గిద్దలూరుకు తరలించారు. పెద్దపులి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సీరియస్ అయిన విషయం తెలిసిందే. పారదర్శక విచారణ చేపట్టాలని అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

20 రోజుల క్రితం మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ ప్రాంతంలో ఉచ్చులో పడి పెద్దపులి మృతి చెందింది. కొందరు వ్యక్తులు పులి కాళ్లను నరికి గోళ్లను ఎత్తుకుపోవడం కలకలం రేపింది. పులి మరణంపై సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. పెద్దపులి మృతి ఆదోళన కలిగించిందన్నారు. పులి మరణం వెనుక ఉన్న కారణాలను వెలికి తీయాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. పులిది సహజ మరణమా, వేటగాళ్ల దుశ్చర్య, విషప్రయోగం జరిగిందా అనే కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలన్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో విస్తృతంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy