Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లి రద్దు చేశారని దారుణం.. యువతి, ఆమె సోదరిపై యాసిడ్ దాడి..

పెళ్లి రద్దు చేశారని దారుణం.. యువతి, ఆమె సోదరిపై యాసిడ్ దాడి..

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి రద్దు చేశారనే కోపంతో ఓ వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. పెళ్లి రద్దు చేసుకున్న యువతిపై యాసిడ్ దాడి చేశాడు.

రక్షించేందుకు ప్రయత్నించిన ఆమె సోదరిపైనా యాసిడ్ పోశాడు. ఈ ఘటన హాపూర్‌లోని ఆవాస్ వికాస్ కాలనీలో చోటుచేసుకుంది. నిందితుడు హర్ష్ భాటిని పోలీసులు అరెస్ట్ చేశారు (Uttar Pradesh acid attack).

హర్ష్ భాటికి ఇటీవల ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే అతడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని తెలుసుకున్న తర్వాత యువతి కుటుంబం పెళ్లిని రద్దు చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి యాసిడ్‌ బాటిల్ తీసుకుని ఆ యువతికి ఇంటికి వెళ్లాడు. తలుపు తీయగానే ఆ యువతిపై యాసిడ్ పోశాడు. ఆమె సోదరి అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఆమెపైనా దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు సోదరీమణులు తీవ్రంగా గాయపడ్డారు (Acid attack on ex-fiancee).

వారి కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే నిందితుడిని పట్టుకున్నారు (Uttar Pradesh crime news). అనంతరం పోలీసులకు అప్పగించారు. గాయపడిన ఇద్దరు మహిళలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

భిన్నత్వంలో ఏకత్వం ఇండియా డీఎన్ఏలోనే ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

'ఆప్' నేత దారుణ హత్య.. బైక్‌ను వెంబడించి మరీ..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy