Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లిపీటలెక్కిన టీమిండియా క్రికెటర్

పెళ్లిపీటలెక్కిన టీమిండియా క్రికెటర్

స్పోర్ట్స్ డెస్క్: భారత జట్టు క్రికెటర్‌ ఆకాశ్‌దీప్‌ వివాహం బంధంలోకి అడుగు పెట్టాడు. అతడి పెళ్లి బుధవారం రాత్రి వారణాసిలో అంగరంగ వైభవంగా జరిగింది.

తన స్నేహితురాలు అక్షిత రాజ్‌కు మూడుముళ్లు వేసి ఆకాశ్‌ వివాహం చేసుకొన్నాడు. నగరంలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో జరిగిన వేడుకలో పెళ్లిదుస్తుల్లో అకాశ్ దీప్ ఆకట్టుకున్నాడు. ఈ కార్యక్రమానికి భోజ్‌పురి సింగర్ పవన్‌ సింగ్‌, ఆకాశ్‌ మిత్రుడు, క్రికెటర్‌ ముఖేశ్ కుమార్‌ హాజరయ్యారు. అలానే పలువురు సెలబ్రిటీలు సైతం ఈ వివాహానికి హాజరయ్యారు.

ఆకాశ్, అక్షితల వివాహం ఇరు కుటుంబాల అంగీకారంతో సంప్రదాయ పద్ధతిలో జరిగింది. వీరి వివాహ వేడుకలు నాలుగు రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. వరుడి పూర్వీకుల నివాసం ఉన్న బడ్డీ గ్రామంలో పెళ్లికి ముందు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత వివాహంలోని ప్రధాన వేడుకను వారణాసిలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ వేదికగా ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. ఇక వధువు విషయానికి వస్తే.. అక్షిత రాజ్‌ స్వస్థలం బిహార్‌లోని రోహ్‌తస్‌ జిల్లా. ఆమె బిట్స్‌పిలానీలో బీసీఏ, ఎంసీఏ పూర్తి చేశారు. ఆకాశ్, అక్షిత చాలాకాలం ఫ్రెండ్స్‪గా ఉండి.. ఆ తర్వతా ప్రేమలో పడ్డారు. చాలాకాలం పాటు ప్రేమించుకుని.. పెద్దలను ఒప్పించుకుని చివరకు పెళ్లితో ఒక్కటయ్యారు.

మునోజ్‌ ఏకైక గోల్‌

జ్యోతికి ఆసియాడ్‌ బెర్త్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy