Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెరుగుతున్న నిత్యావసరాల ధరలు

పెరుగుతున్న నిత్యావసరాల ధరలు

  • ఇబ్బంది పడుతున్న ప్రజలు

హైదరాబాద్: ఏమి కొనేటట్టు లేదు.. ఏమి తినేటట్టు లేదు రాజీగో రాజన్న అంటూ ఓ కవి సినిమా పాటలో వర్ణించిన విధంగానే మార్కెట్లో కూరగాయాల ధరలు మండిపోతున్నాయి.

కూరగాయాల ధరలకు రోజు రోజుకూ రెక్కాలోస్తున్నాయి. ఎల్‌నినో ఎఫెక్ట్‌ కారణంగా రోజుల వ్యవధిలోనే 50శాతం వరకు కొన్ని కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు కూరగాయలను కొనుగోలు చేయాలంటేనే జేబుకు చిల్లు పడుతోందని ఆలోచిస్తున్నారు. ఏ పప్పు, కూర వండినా ఎక్కువ శాతం ప్రజలు ఇష్టపడే టామాట ధర రోజు రోజుకూ పెరుగుతోంది. ఉల్లిపాయ బీనిస్‌ కాయ, చిక్కుడుకాయ, పచ్చిమిర్చి ధరలు భగ్గుమంటున్నాయి. పాతబస్తీలోని గౌలిపురా, ఛత్రినాక, లాల్‌దర్వా మోడ్‌, ఫలక్‌నుమా బహిరంగ మార్కెట్లలో కూరగా యల ధరలు సామాన్య ప్రజలకు అందు బాటులో లేవు.

గత నెలలో రూ. 40 నుంచి రూ. 50 వరకు పలుకుతుండగా, పెద్ద టమాట రూ. 60 వరకు పలుకుతోంది. దీంతో సామాన్య ప్రజలు టామాటను కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. బహిరంగ మార్కెట్లతో పోలిస్తే ప్రధాన కూర గాయలు మార్కెట్లు, రైతు బజార్‌లలో కూరగాయాల ధరలు పది నుంచి పది హేను శాతం తక్కువగా కనిపిస్తున్నాయి. పావు కిలో దరనే చెబుతున్నారు.

ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు

పప్పుల నుంచి అన్ని సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. ఆదాయ వనరులు పెరగకపోవడం.. నిత్యావసరాల ధరలు మండిపోతుండటంతో పేదలు ఒక పూటైనా కడుపునిండా తిండి తినలేని పరిస్థితి నెలకొంది. కూరగాయల ధరలు సరేసరి. ఉదయం ఉన్న ధర సాయంత్రానికి మారిపోతోంది. గతంలో కిలోల్లో ధరలు చెప్పేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మార్కెట్‌కు వెళ్లి ధరలను వాకబు చేస్తే పావు కిలో ధరే చెబుతున్నారు. అంటే కిలో ధర సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొంది.

అన్నదానాలు, క్యాటరింగ్‌పై ఎఫెక్ట్‌

కూరగాయలు ధరలు పెరిగిపోతుండడంతో దసరా దేవీ శరన్నవరాత్రులు నిర్వహించే దుర్గామాత మండపాల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రకాల రకాల కూరగాయలు పెట్టకుండా అన్నదానాలు నిర్వహిస్తున్నారు. శుభ కార్యాలకు ముందే బుకింగ్‌ చేసుకున్న క్యాటరింగ్‌ నిర్వాహకులు పెరిగిన ధరలు చూసి తమకు అదనంగా డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.

 రైతు బజార్లలో ప్రత్యేక విక్రయాలు..

బహిరంగ మార్కెట్లలో టామాట ధర ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు. రైతు బజార్లలో గ్రామాల నుంచి రైతులు తీసుకొచ్చిన కూరగాయలు రైతుబజారు నిర్వాహకులు తీసుకొని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఉల్లిపాయ, టమాటా సబ్సిడీలో అందజేయాలని ప్రజలు కోరుతున్నారు.

 రైతు బజార్‌లో కూరగాయలు ధరలు

ఫలక్‌నుమా రైతు బజార్‌లో కూరగాయల ధరలు గత వారంతో పోలిస్తే ఈ వారం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని రైతు బజార్‌ సిబ్బంది తెలిపారు. గురువారం ధరలు (కిలో, రూపాయల్లో ) ఇలా ఉన్నాయి.

టమోట 27, వంకాయ 23, బెండకాయ 23, పచ్చిమిర్చి 60, కాకరకాయ 23, బీరకాయ 18, క్యాబేజీ 13, బీన్స్‌ 55, క్యారెట్‌ 45, గోకరకాయ 28, చామగడ్డ 40, దోసకాయ 35, దొండకాయ 18, చిక్కుడుకాయ 65, బినీస్‌ కాయ 50, కీర 18, ఉల్లిగడ్డ 40, ఆలుగడ్డ 18, బీట్‌రూట్‌ 33, సొరకాయ 11, పొట్లకాయ 18 వరకు ఉన్నాయి.

ధరలను నియంత్రించాలి

కొన్ని రోజులుగా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పచ్చిమిర్చి కిలో రూ. 60కు పైగానే పలుకుతోంది. టమాటా చిక్కుడు కాయ, బీనీస్‌ ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. రూ. 200 నుంచి 300 వెచ్చించినా వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదు. బియ్యం పప్పుల ధరలు కూడా అమాంతం పెరగడంతో ఏమి తినాలో తెలియని పరిస్థితి నెలకొంది.

  • స్వప్న (గృహిణి)


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy