ఇంటర్నెట్ డెస్క్: పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో తప్పనిసరిగా వెల్లడించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు స్వీకరించలేదు.
అయితే ఈ అంశంపై పిటిషనర్ సంబంధిత హైకోర్టును, సమర్థ అధికారిని ఆశ్రయించవచ్చని తెలిపింది. అడ్వొకేట్ నరేంద్ర కుమార్ గోస్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు (Supreme Court ethanol plea).
పెట్రోల్ బంకుల్లోని డిస్పెన్సింగ్ నాజిల్స్‌పై పెట్రోల్‌లో కలిపిన ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా ప్రదర్శించాలని ఈ పిటిషన్‌లో నరేంద్ర కోరారు. వినియోగదారులకు ఇచ్చే పెట్రోల్ బిల్లులు, రసీదులపై కూడా ఇథనాల్ శాతాన్ని ముద్రించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్న ఇంధనంలో అసలు ఏమి ఉందో తెలుసుకునే హక్కు కలిగి ఉన్నారని పిటిషనర్ వాదించారు. అయితే ఈ పిటిషన్ ప్రభుత్వ ఈ20 విధానాన్ని వ్యతిరేకించేది కాదని, కేవలం ఇంధనంపై పారదర్శకత, వినియోగదారుల అవగాహన కోసమేనని తెలిపారు (E20 petrol pumps).
ఈ20 పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ ఉంటుంది (Ethanol percentage in petrol) దిగుమతి చేసుకునే ముడి చమురుపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడం, ఉద్గారాలను తగ్గించడం, దేశీయంగా ఉత్పత్తి చేసే బయోఫ్యూయల్స్ వినియోగాన్ని పెంచడం ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. అయితే ఈ20 ఇంధన వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా అధిక ఇథనాల్ మిశ్రమాల కోసం రూపొందించని పాత వాహనాల విషయంలో ఎదురయ్యే సమస్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానంటూ నమ్మించి మోసం.. జగన్‌పై ఎంపీ మాగుంట సీరియస్

