Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు: సీఎం చంద్రబాబు

పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు: సీఎం చంద్రబాబు

మరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి లేకుంటే సంపద లేదని.. సంపద లేకుంటే సంక్షేమం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. మనం అందించే సేవలపై ప్రజలు సంతృప్తి చెందాలని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈరోజు (గురువారం) సచివాలయంలో జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. అధికారులు సమష్టిగా పనిచేసి.. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ప్రజాసమస్యలను వందశాతం పరిష్కరించాలని మార్గనిర్దేశం చేశారు. ఏపీని పునఃనిర్మిస్తామని తాను, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చామని ప్రస్తావించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. రిఫార్మ్, ఇన్నోవేషన్, డెలివరీ అనేది చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. అందరి సహకారంతో రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందని.. ఇది సమష్టి విజయమని ఉద్ఘాటించారు. ఈ అవార్డు తనకు బాధ్యతతో కూడినది అని.. నిజానికి ఇలాంటి అవార్డులు పాజిటివ్ మూడ్ క్రియేట్ చేస్తాయని వ్యాఖ్యానించారు.

డబ్బును సృష్టించి పనులు చేయించాలి..

ప్రజాప్రతినిధులు, అధికారుల కలయికే కూటమి ప్రభుత్వమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో డెలివరీ లీకేజిలు ఎక్కువగా ఉండేవని... ఇప్పుడు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వెళ్తున్నాయని వివరించారు. జగన్ హయాంలో ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రోడ్ల అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజల సంతృప్తి స్థాయిని కొలమానంగా పెట్టుకుని పాలన అందిస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు కలెక్టర్ రిపోర్టు పంపేవారని.. అయితే వారు ఇప్పుడు పంపక్కరలేదని... తామే పంపిస్తామని అన్నారు. ప్రజాసమస్యలు అన్నింటిని పాజిటివ్‌గా పరిష్కరించాలని ఆదేశించారు. వ్యవస్ధను మ్యానేజ్ చేయడానికి కాదని.. దాన్ని మార్చడానికి ఈ ప్రభుత్వం ఉందని తెలిపారు. డబ్బు లేదనేది నిజం కాదని... డబ్బును సృష్టించి పనులు చేయించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

.

రాజకీయాల్లో విలువలు లేని పార్టీ వైసీపీ: మంత్రి డీబీవీ స్వామి

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలివే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy