Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) 24వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 23వ విడతను 2026 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

అప్పుడు 9.44 కోట్లకు పైగా అర్హులైన అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.18,880 కోట్లు జమయ్యాయి. నిబంధనల ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పీఎం కిసాన్ నిధులు విడుదలవుతాయి. దీంతో 24వ విడత అక్టోబర్‌లో వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు.

ఇదిలా ఉండగా, ఈ-కేవైసీ (eKYC), ఆధార్ సీడింగ్, ల్యాండ్ సీడింగ్ పూర్తి కాకపోతే తదుపరి విడత నిధులు నిలిచిపోయే అవకాశం ఉందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో చాలా మంది అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఈ మేరకు రైతులు ముందుగానే తమ వివరాలను పరిశీలించుకోవడం మంచిది.

ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలి..?

పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌లో రైతులు eKYC పూర్తి చేసుకోవచ్చు. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ఉంటే OTP ద్వారా ఉచితంగా eKYC చేయవచ్చు. మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ కాకపోతే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా eKYC పూర్తి చేసుకోవచ్చు.

బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి

పీఎం కిసాన్ నిధులు డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఇందుకోసం కేవలం బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేయడం మాత్రమే సరిపోదు. ఖాతాకు NPCI సర్వర్‌లో ఆధార్ సీడింగ్ పూర్తై ఉండాలి. రైతులు తమ బ్యాంకు శాఖకు వెళ్లి డీబీటీ కోసం తమ ఖాతాకు ఆధార్ సీడింగ్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తికాని పక్షంలో ఆధార్ సీడింగ్ చేయించుకోవాలి.

ల్యాండ్ సీడింగ్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

పీఎం కిసాన్ పథకం ప్రయోజనం పొందాలంటే రైతు పేరుపై సాగుకు అనువైన భూమికి సంబంధించిన చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ రికార్డులు ఉండాలి. అలాంటి పత్రాలు ఉన్న అన్నదాతలు ల్యాండ్ సీడింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి పీఎం కిసాన్ పోర్టల్‌లోని 'Know Your Status' విభాగానికి వెళ్లాలి. అక్కడ ల్యాండ్ సీడింగ్ ఎదురుగా 'Yes' ఉందా, 'No' ఉందా చూడాలి. No అని ఉంటే రైతులు తమ ఖతౌనీ, జమాబందీ, ఆధార్ ప్రతులతో సంబంధిత అధికారులను సంప్రదించి భూమి వివరాలను పోర్టల్‌లో అప్‌డేట్ చేయించుకోవాలి.

పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి..?

రైతులు తమ ఈ-కేవైసీ, ఆధార్ సీడింగ్, ల్యాండ్ సీడింగ్ వివరాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.

  • pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

  • హోమ్‌పేజీలో 'Know Your Status'పై క్లిక్ చేయాలి.

  • రిజిస్ట్రేషన్ నంబర్, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్ నమోదు చేయాలి.

  • 'Get Data'పై క్లిక్ చేయాలి.

  • స్క్రీన్‌పై eKYC, Aadhaar Seeding, Land Seeding స్టేటస్ 'Yes/No' రూపంలో కనిపిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి

రకుల్ ప్రీత్ సింగ్, వాషు భగ్నానీకి షాకిచ్చిన ముంబై ఐటీ అధికారులు

18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy