Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పిల్లల పాస్‌పోర్టుకు తల్లిదండ్రుల పౌరసత్వంతో లింకు!

పిల్లల పాస్‌పోర్టుకు తల్లిదండ్రుల పౌరసత్వంతో లింకు!

  • జన్మతః పౌరసత్వాలు, బర్త్‌ టూరిజం అంశాల్లో అమెరికా ప్రభుత్వ కీలక నిర్ణయం

వాషింగ్టన్‌, సెప్టెంబరు 2 : అమెరికాలో పుట్టిన పిల్లలకు పాస్‌పోర్టు జారీ చేసే ప్రక్రియను మరింత కఠినతరం చేసే దిశగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

వలసదారుల పిల్లలకు జన్మతః లభించే పౌరసత్వాల(బర్త్‌ రైట్‌ సిటిజన్‌షి్‌ప)ను, బర్త్‌ టూరిజంను తగ్గించేందుకే నిబంధనలను మారుస్తోంది. పిల్లల పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసే తల్లిదండ్రులు తమ పౌరసత్వ లేదా ఇమ్మిగ్రేషన్‌ వివరాలను తప్పనిసరిగా సమర్పించే విధంగా ట్రంప్‌ సర్కారు నిబంధనలు మారుస్తుందని రాయిటర్స్‌ ఓ కథనంలో పేర్కొంది. విదేశీ వలసదారుల పిల్లలకు జన్మతః లభించే పౌరసత్వాన్ని పరిమితం చేసేలా బర్త్‌ టూరిజంను నిషేధించేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆగస్టు 6న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం అమెరికాలో జన్మించిన చిన్నారి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు తల్లిదండ్రులు తమ సంబంధాన్ని నిరూపించే పత్రాలు, ఫొటో గుర్తింపు పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది. కానీ, ప్రతిపాదిత కొత్త నిబంధన ప్రకారం పిల్లల పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు.. తమ చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు, జనన ధృవీకరణ పత్రం, ఐ-94 ఎరైవల్‌ సర్టిఫికెట్‌ లేదా శాశ్వత నివాస హోదాకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని ఆ కథనం పేర్కొంది. ఆయా పత్రాల ఆధారంగా సదరు చిన్నారికి అమెరికా పాస్‌పోర్టు పొందేందుకు అర్హత ఉందా ? లేదా ? అని నిర్ణయిస్తారు. ట్రంప్‌ సర్కారు చేసిన ఈ ప్రతిపాదనలకు న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. కొత్త నిబంధనలను సెప్టెంబరు 5 నుంచి అమలు చేసేలా ఆదేశాలు ఉన్నాయని రాయిటర్స్‌ తన కథనంలో పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy