మక్కువ, ఆగస్టు4(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు.. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ ఆలయంలో మంగళవారం ఘనంగా శాకంబరి ఉత్సవం నిర్వహించారు.
ఆషాఢమాసం సందర్భంగా పలురకాల కూరగాయలతో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించారు. పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు శాకంబరిగా దర్శనమిచ్చిన పోలమాంబను చూసి పులకించి పోయారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ తిరుపతిరావు, ఆలయ ఇన్‌చార్జి ఇవో సూర్యనారాయణ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

