Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలవరం ప్రాజెక్టుపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టుపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

విశాఖ: పోలవరం ప్రాజెక్టుపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. కాసుల కక్కుర్తి కోసం టీడీపీ నేతలు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. పోలవరాన్ని కేంద్రం కట్టక్కర్లేదు.. తామే కడతామని టీడీపీ నేతలు చెప్పారని, కాంట్రాక్టర్ల కోసం పోలవరం ప్రాజెక్ట్‌ తీసుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీని ఒప్పించి పోలవరం పూర్తి చేయడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. దుర్బుద్ధి లేదని జగన్‌ బహిరంగంగా చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. అవసరం అయితే పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పజెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy