హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): పేట్ బషీరాబాద్ పోలీసులకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath Case) ఓ లేఖ పంపించారు. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, వ్యక్తిగత కారణాల నేపథ్యంలో మే 15వ తేదీన విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు.
ఈ మేరకు సిట్ అధికారులకు ఈమెయిల్‌తో పాటు అధికారిక లేఖను కూడా బండి భగీరథ్ పంపించారు. ఈ కేసులో విచారణకు హాజరయ్యే సమయంలో కీలక ఆధారాలు, సాక్ష్యాలతో వస్తానని ఆయన స్పష్టం చేశారు.
అలాగే సిట్ అధికారుల దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని భగీరథ్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో అవసరమైన సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. బండి భగీరథ్ పంపిన లేఖ ప్రస్తుతం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మే 15వ తేదీన జరగనున్న విచారణలో ఆయన సమర్పించే ఆధారాలు కీలకంగా మారే అవకాశం ఉంది.

