Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోరాడాం.. గెలిచాం.. కాబో వెర్డ్‌పై విజయం తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

పోరాడాం.. గెలిచాం.. కాబో వెర్డ్‌పై విజయం తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో అరంగేట్ర జట్టు కాబో వెర్డ్‌పై జరిగిన ఉత్కంఠభరిత పోరులో అర్జెంటీనా 3-2 తేడాతో పోరాడి గెలిచింది. దీంతో రౌండ్ 16కు అర్హత సాధించింది.

పసికూన కాబో వెర్డ్‌ అద్భుత ఆటతీరుకు ఫుట్‌బాల్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించింది. అయితే ఆఖరిలో అద్భుతంగా పుంజుకున్న అర్జెంటీనా.. కాబో వెర్డ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగంగా పోస్ట్ పెట్టాడు.

'ఈ మ్యాచ్ కష్టంగా ఉంటుందని అంచనా వేశాం. ఆ ఒత్తిడిని భరించి చివరికి విజయాన్ని సాధించాం. కాబో వెర్డ్‌పై పోరాడాం.. బాధను భరించాం.. చివరికి గెలిచాం. అయితే ఈ టోర్నీలో ఇంకా మా ప్రయాణం కొనసాగుతోంది' అంటూ మెస్సి తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. కాగా చివరి వరకూ అద్భుతంగా పోరాడిన కాబో వెర్డ్‌పై మెస్సి ప్రశంసల జల్లు కురిపించాడు. 'ప్రపంచ కప్‌లో ఏదీ తేలిగ్గా రాదు. కాబో వెర్డ్‌ ఈ టోర్నీలో అద్భుతంగా ఆడింది. ఇప్పుడు మాకు కాస్త విరామం దొరికింది. ఈ మ్యాచ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. తదుపరి పోరుపై దృష్టి పెడతాం' అని మెస్సి తెలిపాడు. కాగా ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా.. ఈజిప్ట్‌తో తలపడనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy