Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోర్చుగల్ తరఫున సెంచరీ బాదిన ఆసీస్ మాజీ క్రికెటర్!

పోర్చుగల్ తరఫున సెంచరీ బాదిన ఆసీస్ మాజీ క్రికెటర్!

స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ ప్రస్తుతం పోర్చుగల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే సంచలన ప్రదర్శనతో హెన్రిక్స్ అదరగొడుతున్నాడు.

తాజాగా చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 51 బంతుల్లోనే 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేసి అజేయ శతకం సాధించాడు. 39 ఏళ్ల హెన్రిక్స్ కెరీర్‌లో ఇదే తొలి అంతర్జాతీయ శతకం కావడం విశేషం.

ఈ అద్భుత ప్రదర్శనతో పోర్చుగల్ జట్టు 20 ఓవర్లలో 211/6 భారీ స్కోర్ సాధించింది. అనంతరం వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పోర్చుగల్ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పోర్చుగల్ జట్టు ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్ 2028 సబ్ రీజినల్ యూరోప్ క్వాలిఫయర్ గ్రూప్-సి లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

పోర్చుగల్ తరుఫున అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే అజేయంగా 66 పరుగులు చేసిన హెన్రిక్స్, తాజాగా ఈ శతకంతో జట్టు విజయావకాశాలను మరింత మెరుగుపరిచాడు. పోర్చుగల్‌ను 2028 టీ20 ప్రపంచ కప్‌నకు అర్హత సాధించాలంటే హెన్రిక్స్ పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. అతడి ప్రదర్శనపైనే పోర్చుగల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయని క్రీడా నిపుణులు చెబుతున్నారు. హెన్రిక్స్ ఆస్ట్రేలియా తరఫున మూడో ఫార్మట్లలో కలిపి 47 మ్యాచులు ఆడాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy