Dailyhunt
ప్రాచీన విగ్రహాల స్వాధీనం

ప్రాచీన విగ్రహాల స్వాధీనం

పెరంబూర్‌(చెన్నై): స్థానిక కీల్పాక్కం ఆరా అముదన్‌ గార్డెన్స్‌లో పని చేస్తున్న ఎక్స్‌పోర్ట్‌ సంస్థలో ప్రాచీన విగ్రహాలు దాచి నట్ట్లు విగ్రహాల అక్రమ తరలింపు నిరోధక విభాగం పోలీసులకు సమాచారం అందింది. డీజీపీ శైలేంద్ర బాబు ఉత్తర్వులతో, విగ్రహాల అక్రమ తరలింపు నిరోధక విభాగం అదనపు డీజీపీ అభయ్‌కుమార్‌సింగ్‌ నేతృత్వంలో ఎస్పీ పొన్ని, ప్రత్యేక విభాగం పోలీసులు సోమవారం సాయంత్రం ఆ సంస్థ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో విదేశాలకు ఎగుమతి చేసే విభాగంలో ఉన్న పార్శిల్స్‌ పరిశీలించగా ఒక పంచలోహ అమ్మవారి విగ్రహం, రెండు అమ్మవార్ల రాత్రి విగ్రహాలు లభ్యమయ్యాయి. ఈ వ్యవహారంలో సంస్థ యజమాని సుబ్రమణియన్‌ (58) పోలీసులు అరెస్టు చేశారు.

సుబ్రమణ్యం ప్రముఖ విగ్రహాల అక్రమ తరలింపులో సంబంధాలున్న సుభాష్‌కపూర్‌ ముఠాకు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy