Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది: భట్టి

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని, సమస్యల నుంచి వారి దృష్టిని మరల్చడానికి సీఎం మార్పు అంశంపై చర్చ మొదలు పెట్టారని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో గురువారం భట్టి మీడియాతో మాట్లాడుతూ ఎవరు సీఎం అన్నది ఆ పార్టీ అంతర్గత విషయమని, ముందుగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇక, బండి సంజయ్‌ బడాయి మాటలకు అంతే లేకుండా పోయిందని, వాళ్లని, వీళ్లని అరెస్టు చేయిస్తానంటారే కానీ.. ఇంతవరకు కేసు పెట్టిందే లేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం అవినీతిపై తామే అమిత్‌షాను కలుస్తామని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy