Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

అమరావతి: ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. ఐఏఎస్‌ కేడర్‌ నిబంధనల మార్పుపై జగన్‌ లేఖ రాశారు. ఐఏఎస్‌లను కేంద్రానికి డిప్యూటేషన్‌పై తీసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీని వల్ల రాష్ట్రాల్లో ప్రధాన ప్రాజెక్ట్‌లు సమర్థవంతంగా అమలు జరపలేమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో వివిధ పథకాల అమలుకు ఐఏఎస్‌ల అవసరం ఉంటుందని జగన్‌ తెలిపారు. కేంద్రానికి డిప్యూటేషన్‌పై పంపించే ఐఏఎస్ అధికారుల ఎంపికలో రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండాలని సీఎం జగన్ కోరారు. కేంద్రం ఐఏఎస్‌ క్యాడర్‌ రూల్స్‌ మార్పుపై పునరాలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీ నుంచి కేంద్రం డిప్యూటేషన్‌పై అడిగిన అధికారులను ఇప్పటికే పంపామని లేఖలో జగన్‌ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy