Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నారు'.. కాంగ్రెస్‌పై ఎంపీ ఈటల ఆగ్రహం

'ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నారు'.. కాంగ్రెస్‌పై ఎంపీ ఈటల ఆగ్రహం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: 'మేమే ఓట్లని ట్యాంపరింగ్ చేస్తే మాకు 400 ఎంపీ సీట్లు వచ్చేవి.. కానీ 240 సీట్లకు మాత్రమే బీజేపీ పరిమితం అయ్యింది' అని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని చూసి జనం ఛీ కొడుతున్నారని వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో 'సర్' అనేది కొత్తది కాదని తెలిపారు. ఈవీఎంలను తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ అని గుర్తుచేశారు. వీవీ ప్యాట్‌లను తీసుకువచ్చింది మోదీ ప్రభుత్వమని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

గెలవలేక సమస్యలు సృష్టిస్తున్నారు: ఎంపీ ధర్మపురి

కాంగ్రెస్ ముక్త్ భారత్.. రాహుల్ గాంధీతోనే సాధ్యమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. పౌరసత్వానికి ముందే సోనియా గాంధీకి ఓటు ఎలా వచ్చిందో రాహుల్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసీని వాడుకొని వారికి పదవులు ఇచ్చిందే కాంగ్రెస్ అంటూ దుయ్యబట్టారు. ఎన్నికల్లో గెలవలేక లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని, హిందువులను కించపరచడమే లక్ష్యంగా రాహుల్ పని చేస్తున్నారని విమర్శించారు. రాహుల్‌ను ప్రతిపక్ష పదవి నుంచి తొలగించాలని ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy