Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజల ఆశీస్సులకు అనుగుణంగా పాలన

ప్రజల ఆశీస్సులకు అనుగుణంగా పాలన

  • మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

ఖమ్మం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రజల ఆశీస్సులకు అనుగుణంగా రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వ పాలన సాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ఈ వెయ్యి రోజుల్లో ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రిగా తాను సీఎం రేవంత్‌రెడ్డికి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తున్నానని, రైతులు, రైతు కూలీల సంక్షేమానికి కృషిచేస్తున్నానని తెలిపారు. ఖమ్మం నగరంలో సోమవారంపర్యటించిన ఆయన.. ప్రకా్‌షనగర్‌లో రూ.12 కోట్లతో చేపట్టే రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డిని ఆశీర్వదించడంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అన్నివర్గాలకు న్యాయం చేయాలనే తపనతో సీఎం పనిచేస్తున్నారని కితాబిచ్చారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా రైతుల సంక్షేమానికి తాను కృషిచేస్తున్నానన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy