Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజలకు వైద్యసేవలు అందించడమే కేసీఆర్‌ లక్ష్యం: మంత్రి నిరంజన్ రెడ్డి

ప్రజలకు వైద్యసేవలు అందించడమే కేసీఆర్‌ లక్ష్యం: మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి: ప్రజలకు వైద్యసేవలు అందించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం వనపర్తిలో మొబైల్ ఐసీయూ క్రిటికల్ కేర్ బస్‌ను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలో వైద్య, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. 10 వేల కోట్లతో రాష్ట్రంలో వైద్యరంగం పటిష్టానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కరోనా నివారణకు జిల్లాకో మొబైల్ ఐసీయూ బస్ అందించి.. క్రిస్టియన్ మైనార్టీ సంస్థ సామాజిక బాధ్యతను చాటుకుందని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy