Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలి: అఖిలపక్ష నేతలు

అమరావతి: ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం ఏపీలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలపై అఖిలపక్ష నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలు పలు తీర్మానాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ కోసం నిధులు కేటాయించాలని కోరారు. ఆక్సిజన్ సరఫరాకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. కరోనా బాధితులకు తక్షణ సాయం కింద.. రూ.10వేలు చొప్పున 6 నెలలు అందించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలని తెలిపారు. సీఎం జగన్ వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నేతలు కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy