Dailyhunt
ప్రజలను బాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు : మంత్రి వేణు

ప్రజలను బాబు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు : మంత్రి వేణు

కాకినాడ : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు ఆరోపించారు. మంగళవారం నాడు తూర్పుగోదావరిలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి నియంత్రణలో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు అవలంభిస్తున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన దుర్ఘటన దురదృష్టకరమన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది మహిళలకు 'వైఎస్సార్‌ చేయూత' పథకం వర్తింపజేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఈ పథకానికి ఈ ఏడాది రూ. 4,7 00 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్జ్రంలో ఉన్న 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు రేపు అనగా బుధవారం 'వైఎస్సార్‌ చేయూత' పథకం ప్రారంభించనున్నట్లు వేణుగోపాల కృష్ణ తెలిపారు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నేరుగా ఏడాదికి 18,750 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా.. సీఎం జగన్‌ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy