హైదరాబాద్, ఏప్రిల్ 2: నార్సింగిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గండిపేటలో ఎనిమిది నెలల పసికందు సంపులో పడి మృతి చెందింది. ఆడుకుంటూ ఇంటి బయటికి వచ్చిన చిన్నారి ప్రమాదవశాత్తు సంపులో పడిపోయింది.
వెంటనే గమనించిన తల్లిదండ్రులు సంపు దగ్గరకు వెళ్లేలోపే నీటిలో మునిగిపోయింది చిన్నారి. సంపులో నుంచి చిన్నారిని బయటకు తీసిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీగా విలపించారు.
పొట్ట చేత పట్టుకుని మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చిన చిన్నారి తల్లిదండ్రులు.. గండిపేటలో జీవనం సాగిస్తున్నారు. అప్పటి వరకు ఆడుకుంటున్న తమ చిన్నారి ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
.
Read Latest Telangana News And Telugu News

