Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రణబ్ ప్రధాని కావాలనుకున్నారు.. తన ఆత్మకథలో వెల్లడించిన సోనియా గాంధీ..

ప్రణబ్ ప్రధాని కావాలనుకున్నారు.. తన ఆత్మకథలో వెల్లడించిన సోనియా గాంధీ..

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షను కలిగి ఉండేవారా? ఈ ప్రశ్నకు సంబంధించి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన కొత్త పుస్తకంలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

2010లో తనతో జరిగిన ఓ సంభాషణలో ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని తెలిపారు. నాయకత్వంలో మార్పు రావాల్సిన సమయం వచ్చిందని ఆయన సూచించారని తెలిపారు (Sonia Gandhi Book).

సోనియా గాంధీ రాసిన 526 పేజీల పుస్తకం 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' నవంబర్ 10న విడుదలైంది. ఇందులో తన వ్యక్తిగత జీవితంతో పాటు కాంగ్రెస్ రాజకీయాలు, యూపీఏ ప్రభుత్వంలో చోటుచేసుకున్న పరిణామాలు, మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీలతో తన అనుబంధం గురించి పలు విషయాలను వెల్లడించారు. 2010లో కొన్నిసార్లు ప్రణబ్ ముఖర్జీ తనతో ప్రత్యేకంగా మాట్లాడేవారని సోనియా గుర్తుచేసుకున్నారు. నాయకత్వంలో మార్పు రావాల్సిన సమయం వచ్చిందని ప్రణబ్ తనతో అన్నారని, ఆ మాటలను ప్రధానమంత్రి కావాలనే ఆయన చిరకాల కోరికకు సంకేతంగా అర్థం చేసుకున్నానని సోనియా రాశారు (Pranab Mukherjee PM Wish).

ఆయన వ్యాఖ్యలకు తాను సున్నితంగా స్పందిస్తూ సంభాషణను మరో అంశం వైపు మళ్లించానని చెప్పారు (Congress Politics). దీనివల్ల ప్రణబ్ ముఖర్జీ కొంత నిరాశ చెంది ఉండవచ్చన్నారు. అయినప్పటికీ తనతో ప్రణబ్ ఎప్పుడూ మంచిగానే ఉన్నారని తెలిపారు. ప్రణబ్ ముఖర్జీకి ప్రధానమంత్రి పదవి దక్కకపోయినా, 2012లో యూపీఏ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ ఆయన పేరును ప్రకటించింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించి భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.

/span>

ఎన్విడియా సీఈఓ వ్యవహారంపై ఎఫ్‌బీఐ దర్యాప్తు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy