Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని దారుణ హత్య

ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని దారుణ హత్య

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాకు చెందిన ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని టెటే(38) శనివారం దారుణ హత్యకు గురయ్యారు. ఈస్టర్న్ కేప్‌లోని ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు.

దక్షిణాఫ్రికా క్రీడలు, కళలు, సాంస్కృతిక శాఖ మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. జొలాని టెటే తన కారులో బయటకి వెళ్లి ఇంటికి చేరుకున్నాడు. గేటు తెరుచుకునే వరకు బయటే కారులో వేచి ఉన్నాడు. ఇంతలోనే ఇద్దరు గుర్తు తెలియని దుండగులు తుపాకీలతో కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో జొలాని మరణించగా.. అదే కారులో ఉన్న ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రపంచ టైటిళ్ల నుంచి గిన్నిస్ రికార్డు వరకు..

జొలాని టెటే తన కెరీర్‌లో ఎన్నో కీలక విజయాలు అందుకున్నాడు. 2007-2008లో డబ్ల్యూబీఎఫ్ ప్రపంచ టైటిల్, 2017, 2019లో డబ్ల్యూబీఓ బాంటమ్‌వెయిట్ ప్రపంచ టైటిల్ గెలుచుకున్నాడు. 2017లో సిబోనిసో గోన్యాపై ప్రపంచ టైటిల్ పోరులో టెటే కేవలం 11 సెకన్లలోనే నాకౌట్ విజయం సాధించాడు. తొలి పంచ్‌తోనే ప్రత్యర్థిని పడగొట్టిన టెటే విజయం.. ప్రపంచ టైటిల్ పోరులో అత్యంత వేగవంతమైన నాకౌట్‌లలో ఒకటిగా నిలిచి గిన్నిస్ రికార్డులకెక్కింది. టెటే ప్రొఫెషనల్ కెరీర్‌లో 29 విజయాలు, 22 నాకౌట్లు, 4 ఓటములు, ఒక నో-కాంటెస్ట్ నమోదు చేశారు. 2022 జులైలో లండన్‌లోని వెంబ్లీ అరేనాలో జాసన్ కన్నింగ్‌హామ్‌పై సాధించిన విజయం ఆయన చివరి బౌట్‌గా నిలిచింది. డోపింగ్ వివాదం కారణంగా 4 సంవత్సరాల నిషేధం ఎదుర్కొన్న అతడు, ఆ నిషేధం ముగిసిన తర్వాత మళ్లీ రింగ్‌లోకి దిగడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

strong>

డీఆర్ఎస్ తీసుకోవాలని బంగ్లాను రెచ్చగొట్టిన స్మిత్.. అంపైర్ వార్నింగ్

పరాజయాలను పతనంగా చూడొద్దు.. భారత టెస్టు క్రికెట్ గాడి తప్పలేదు: గంభీర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy