Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచానికి ఏ అవసరం వచ్చినా గుర్తొచ్చేది మన సైనిక విజయాలే: మోదీ

ప్రపంచానికి ఏ అవసరం వచ్చినా గుర్తొచ్చేది మన సైనిక విజయాలే: మోదీ

న్యూఢిల్లీ: 'ప్రపంచ యుద్ధాలు కావచ్చు, శాంతి స్థాపన యత్నాలు కావచ్చు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా యావత్ ప్రపంచం భారత సైనికుల వైపే చూస్తుంటుంది. మన సాహస సైనికుల సాహస విజయాలు, శాంతి యత్నాలే గుర్తుకువస్తాయి' అని ప్రధాని మోదీ భారత జవాన్లపై ప్రశంసలు కురిపించారు. బలహీనంగా ఉన్న వారెవరూ శాంతికి చొరవ తీసుకోరని, శాంతికి అవసరమైనది సాహసమేనని అన్నారు. యావత్ ప్రపంచానికి మన సైనికుల సాహసం, శాంతి యత్నాల్లో చూపించే సత్తా బాగా తెలుసునని కొనియాడారు.

గాల్వాన్ లోయలో అమరులైన సైనికులకు ప్రధాని మరోసారి నివాళులర్పిస్తూ, సైనికుల త్యాగాలు, సేవాదృక్ఫథం కారణంగా స్వయం సమృద్ధి భారతం సాధించాలన్న సంకల్పం మరింత దృఢతరమవుతోందన్నారు.

సైనికుల సాహసం వారు విధులు నిర్వహిస్తున్న ఎత్తైన ప్రాంతాల కంటే సమున్నతమని మోదీ కొనియాడారు. లెహ్, లడక్ నుంచి సియాచిన్, కార్గిల్... గాల్వాన్‌లోని గడ్డకట్టించే జలాలు, ప్రతి పర్వతం, ప్రతి శిఖరం కూడా మన భారత సైనికుల సాహసాన్ని ప్రత్యక్ష్యంగా వీక్షించినవేనని భారత సైనికుల్లో మోదీ మరింత ఉత్సాహం, నైతిక స్థైర్యం నింపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy