Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనాలు పూర్తి.. పోలీసులకు సీపీ సజ్జనార్ అభినందనలు

ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనాలు పూర్తి.. పోలీసులకు సీపీ సజ్జనార్ అభినందనలు

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోనినాలుగు కమిషనరేట్‌లలో విజయవంతంగా గణేశ్ శోభాయాత్రలు ముగిశాయని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) వ్యాఖ్యానించారు.

ఈ వేడుకకు సహకరించిన అన్నిశాఖల అధికారులను అభినందించారు. హోం గార్డ్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్‌లో మీడియాతో సీపీ సజ్జనార్ మాట్లాడారు. హైదరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా శోభాయాత్రలు జరిగాయని వెల్లడించారు.

ఖైరతాబాద్, బాలాపూర్ గణపతుల విగ్రహాలను సమయానికి నిమజ్జనం చేశాం..

భాగ్యనగరంలోని గణేశ్ నిమజ్జనోత్సవాల బందోబస్తు కోసం తెలంగాణలోని బయట జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనాలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఖైరతాబాద్, బాలాపూర్ వినాయకుల విగ్రహాలను సమయానికి నిమజ్జనం చేశామని వెల్లడించారు. భాగ్యనగర్ ఉత్సవ సమితి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈసారి గణనాథుల విగ్రహాలను దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగా వచ్చారని అన్నారు. 30 లక్షలకు పైగా భక్తులు ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకున్నారని చెప్పారు. బాలాపూర్ లంబోదరుడిని 15 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు.

48 గంటల పాటు పోలీసులు నిద్ర లేకుండా పనిచేశారు..

వినాయకుల శోభాయాత్రాల్లో కొన్ని కొన్ని లోపాలను గుర్తించామని.. వచ్చే రోజుల్లో వీటిని సరిదిద్దుకుంటామని సీపీ సజ్జనార్ చెప్పారు. రాబోయే రోజుల్లో మెరుగైన సేవలను అందిస్తామని స్పష్టం చేశారు. పోలీసు అధికారులు నిద్ర లేకుండా బందోబస్తు చేశారని తెలిపారు. శోభాయాత్రలో కలర్ పేపర్‌తో చాలా ఇబ్బంది అవుతోందని.. వచ్చేసారి వీటిని బ్యాన్ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్నదానం చేసే ప్రాంతాల్లో చెత్తను ఇష్టానుసారంగా వేస్తున్నారని.. అది చాలా ఇబ్బందిగా మారిందని తెలిపారు. శోభాయాత్రలో అల్లరి చేసిన మందుబాబులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ అధికారులు ఈ వేడుక కోసం 48 గంటల పాటు నిద్ర లేకుండా పనిచేశారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపయ్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy