Dailyhunt
ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం.. అన్నాడీఎంకే హామీల వర్షం

ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం.. అన్నాడీఎంకే హామీల వర్షం

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నాడీఎంకే (AIADMK) హామీల వర్షం కురిపించింది. నేరుగా ఆర్థిక సాయం, సబ్సిడీల పెంపు, రుణాల మాఫీ, నిరుద్యోగులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, చిరు వ్యాపారాలను ఆదుకోవడం వంటి కీలక హామీలను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి ( Edappadi K. Palaniswami) ప్రకటించారు.

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందిస్తామని, ఎప్లాంయిమెంట్ ఎక్స్ఛేంజ్‌లో పేరు నమోదు చేసుకుని ఉద్యోగం కోసం వేచిచూస్తున్న వారికి నెలవారీ సాయంగా రూ.2,000 చొప్పున ఇస్తామని, హైయర్ సెకండరీ వరకూ చదివి ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్‌లో పేరు నమోదు చేసుకున్న వారికి రూ.1,000 చొప్పున నెలవారీ సాయం అందిస్తామని పళనిస్వామి తెలిపారు.

మత్స్యకారులకు సాయం రూ.12,000కు పెంపు

ఏటా చేపలవేటపై నిషేధం ఉన్న కాలంలో మత్స్యకారులకు ఇచ్చే సాయాన్ని రూ.8,000 నుంచి రూ.12,000కు పెంచుతామని పళనిస్వామి ప్రకటించారు. దీనితో పాటు ఏటా పొంగల్‌కు ఇచ్చే గిఫ్ట్ హ్యాంపర్‌కు అదనంగా మరో వెయ్యి రూపాయలు ఇస్తామని తెలిపారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని 300 యూనిట్ల నుంచి 450 యూనిట్లకు పెంచుతామని, పవర్ లూమ్ నేత కార్మికులకు ఉచిత విద్యుత్ పరిమితిని 1,000 యూనిట్ల నుంచి 1,400 యూనిట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో పేమ్‌మెంట్ల మీద వ్యాపారాలు చేసుకునే చిరువ్యాపారులు సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy