అమరావతి: ప్రతి రైతుకు బోరు అని పథకంలో చెప్పి.. ఒకసారి వేస్తే ఉచితం లేదని మెలిక పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మరి బోరు ఫెయిల్ అయితే రైతు ఏం చేయాలని ప్రశ్నించారు. బోరు ఎండిన రైతులు వ్యవసాయానికి దూరం కావాల్సిందేనా అని మండిపడ్డారు. ''ప్రతి రైతుకు బోరు అని పథకంలో చెప్పి.. ఒకసారి వేస్తే ఉచితం లేదని మెలిక పెట్టారు. బోరు ఫెయిల్ అయితే రైతు ఏం చేయాలి? బోరు ఎండిన రైతులు వ్యవసాయానికి దూరం కావాల్సిందేనా? అర్హత ఉన్న 1,100 గ్రామాలను ఎందుకు విస్మరించారు? మీ హయాంలో రైతులకు జలకళ తప్పిన మాట వాస్తవం కాదా? జగన్ చెప్పాలి'' అంటూ దేవినేని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

