Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట

స్పోర్ట్స్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్, టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ దంపతులు ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందాన్ ఆశ్రమాన్ని విరుష్కా జంట సందర్శించింది.

అక్కడ వారిద్దరూ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. ఇటీవల ఏప్రిల్ 20న అక్షయ తృతీయ సందర్భంగానూ ఈ జంట ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు సార్లు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు.

ప్రేమానంద్ మహారాజ్‌ ఆశ్రమానికి వెళ్లి బయటకు వస్తున్న కోహ్లీ విజువల్స్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఇద్దరూ చాలా సాదాసీదాగా ఆశ్రమానికి వెళ్లారు. మాస్క్‌లతో తమ ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ప్రేమానంద్ ఆధ్యాత్మిక బోధనలు వినేందుకు తరుచూ విరుష్కా జంట ఆశ్రమానికి వెళ్తుంటారు. గత ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. ట్రోఫీ గెలిచిన తర్వాత తొలి సారి ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. మరోవైపు ట్రోఫీ గెలిచిన అనంతరం జరిగిన ఈవెంట్‌లో విరాట్ కోహ్లీ దంపతులు డ్యాన్స్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy