Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో సమస్యకు చెక్‌

ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో సమస్యకు చెక్‌

ఇంటర్నెట్ డెస్క్: వంట చేసేటప్పుడు ప్రెషర్‌ కుక్కర్‌ నుంచి నీరు బయటకు రావడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ముఖ్యంగా కుక్కర్‌ మూతకు ఉండే రబ్బరు వదులుగా మారడం వల్ల ఇలా జరుగుతుంది.

దీనివల్ల వంటగది మురికిగా మారడంతో పాటు, కుక్కర్‌ సరిగా పనిచేయక ఇబ్బంది కలుగుతుంది. ఈ సమస్యను సులభంగా పరిష్కరించేందుకు కొన్ని చిట్కాలు పాటించవచ్చు.

కుక్కర్‌ రబ్బర్‌ను పరిశీలించాలి

కుక్కర్‌ను ఎక్కువ కాలం ఉపయోగిస్తే మూతకు ఉండే రబ్బరు వదులుగా మారుతుంది. దీంతో ఆవిరి బయటకు పోవడం లేదా నీరు కారడం జరుగుతుంది. కాబట్టి కుక్కర్‌ రబ్బరు సరిగ్గా ఉందో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. రబ్బరు వదులుగా ఉంటే కొత్తది తీసుకోవడం మంచిది.

విజిల్‌ను శుభ్రంగా ఉంచాలి

కొన్నిసార్లు ఆహార పదార్థాలు కుక్కర్‌ విజిల్‌లో ఇరుక్కుపోవడం వల్ల ఆవిరి సరిగ్గా బయటకు రాదు. దీంతో కుక్కర్‌ నుంచి నీరు కారే అవకాశం ఉంటుంది. కాబట్టి విజిల్‌, ఆవిరి వచ్చే మార్గాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

మూతకు కొద్దిగా నూనె రాయాలి

కుక్కర్‌ మూత చుట్టూ ఉన్న రబ్బరు భాగానికి కొద్దిగా నూనె రాయడం వల్ల లీకేజీ తగ్గుతుంది. అయితే ఎక్కువ నూనె ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి.

ఎక్కువ నీరు పోయకండి

కుక్కర్‌లో అవసరానికి మించి నీరు పోయడం వల్ల కూడా నీరు బయటకు రావచ్చు. వంటకు సరిపడినంత నీటిని మాత్రమే ఉపయోగించాలి. అలాగే గ్యాస్‌ మంటను ఎక్కువగా కాకుండా మధ్యస్థ స్థాయిలో ఉంచితే కుక్కర్‌ సరిగ్గా పనిచేస్తుంది.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

మొక్కలాంటి నత్త!

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి.. ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy