ప్రభుత్వ ఆదేశాలతో చర్యలు
ఏ ఘాట్‌కూ పెట్టొద్దన్న లోకేశ్
సీతానగరం, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలోని పుష్కర ఘాట్‌కు మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ పేరు తొలగించారు.
శనివారం ప్రభుత్వం ఈ మేరకు ఆదేశించింది. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. మునికూడలిలోని పుష్కర ఘాట్‌కు దేవాన్ష్ పేరు పెట్టడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన స్పందించారు.
ఏ ఘాట్‌కు దేవాన్ష్ పేరు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. 2015లో జరిగిన గోదావరి పుష్కరాలకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ ఆధ్వర్యంలో ఈ ఘాట్‌ను అభివృద్ధి చేసి 'దేవాన్ష్ ఘాట్'గా నామకరణం చేశారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు దేవాన్ష్ ఘాట్ పేరుతో ఉన్న బోర్డును తొలగించారు.

