Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పుష్ప స్టైల్‌లో మద్యం స్మగ్లింగ్.. బొలెరో పైభాగంలో బాటిళ్లు చూసి పోలీసుల షాక్

పుష్ప స్టైల్‌లో మద్యం స్మగ్లింగ్.. బొలెరో పైభాగంలో బాటిళ్లు చూసి పోలీసుల షాక్

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి రోజు సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.

తాజాగా అల్లు అర్జున్ నటించి పుష్ప సినిమాలోలాగా బొలెరో వాహనంలో మద్యం బాటిళ్లు స్మగ్లింగ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిహార్‌ నవాడా జిల్లాలో గోవింద్‌పూర్ చెక్ పాయింట్ వద్ద జరిగిన ఈ సంఘటనతో ఎక్సైజ్ పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. బిహార్‌ రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధం అమలలో ఉంది. దీంతో మద్యం బాటిల్స్ అక్రమ రవాణా కోసం వివిధ మార్గాలను స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు.

ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారులు పసిగట్టారు. దాంతో తనిఖీలను ముమ్మరం చేశారు. చెక్ పోస్టు వద్ద బొలెరో ఎస్‌యూవీపైభాగంలో ఏదో మార్పు జరిగినట్లు ఈ సోదాల్లో వారు గుర్తించారు. వాహనం పైభాగాన్ని పరిశీలించి కోశారు. అందులో భారీగా మద్యం బాటిళ్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఆ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనం డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు. వారిని అరెస్ట్ చేసి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జార్ఖండ్ నుంచి ఈ మద్యం బాటిళ్లను తీసుకొస్తున్నట్లు తమ విచారణలో వెల్లడించారని పోలీసులు చెప్పారు. బొలెరో వాహనాన్ని సీజ్ చేసినట్లు వారు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy