Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ చిక్కుల్లో పడ్డారు. జూనియర్ స్టాయి క్రికెట్ సెలక్షన్‌లో ఎంపికయ్యేందుకు పుట్టిన తేదీ మార్చినట్లు ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి.

దీనికి సంబంధించి జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ మాజీ జాయింట్ ఆనరరీ సెక్రటరీ సుదర్శన మోహతా ఫిర్యాదు చేశారు. దీంతో జమ్మూలోని స్థానిక రైల్వే మేజిస్ట్రేట్ కోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించింది. సెప్టెంబర్ 3లోగా పూర్తి నివేదిక సమర్పించాలని పోలీసులకు తెలిపింది.

మిథున్ మన్హాస్ తన క్రికెట్ కెరీర్‌లో వివిధ దశల్లో వేర్వేరు పుట్టిన తేదీలను సమర్పించారన్నది ఫిర్యాదులోని ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా జూనియర్ స్థాయి క్రికెట్‌కు ఉపయోగించిన పుట్టిన తేదీ, పాఠశాల రికార్డుల్లో ఉన్న తేదీకి భిన్నంగా ఉన్నట్లు సమాచారం. జమ్ములోని మహారాజా హరి సింగ్‌ అగ్రికల్చర్‌ కాలేజియేట్‌ స్కూల్‌ రికార్డుల ప్రకారం.. మిథున్ మన్హాస్ పుట్టిన తేదీ 1977 డిసెంబర్‌ 9గా ఉండగా.. ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ వెబ్‌సైట్‌లో 1979 అక్టోబర్‌ 12గా నమోదై ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిర్వహించే ప్రాథమిక విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంపై మిథున్ మన్హాస్ అధికారికంగా స్పందించలేదు.

చర్చలోకి పాత వివాదాలు..

జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌లో వయసు, అర్హతకు సంబంధించిన ఆరోపణలు కొత్తేమీ కావన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఓ జమ్మూకశ్మీర్‌ క్రికెటర్‌పై జూనియర్‌ క్రికెట్‌ అర్హతకు సంబంధించి వయసు విషయంలో ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారం జమ్మూకశ్మీర్‌ పోలీసుల క్రైమ్‌ బ్రాంచ్‌ వరకు వెళ్లి, ఆరోపణలను పరిశీలించిన అనంతరం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఆ కేసును అనంతరం జమ్మూ క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున అప్పటి ఓ సీనియర్‌ సబ్‌ కమిటీ సభ్యుడు ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత అదే క్రికెటర్‌ తిరిగి జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ వ్యవస్థలో కనిపించడం చర్చకు దారితీసింది.

strong>

ఐపీఎల్ కోసం సహజ శైలిని మార్చుకోవద్దు.. మానవ్ సుతార్‌కు పుజారా సూచన

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: క్వార్టర్ ఫైనల్‌కు ట్రీసా-గాయత్రి జోడీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy