Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాహుల్ ద్రవిడ్ యజమానిలానే వ్యవహరిస్తున్నాడు: కోచ్ విక్రమ్ రాథోడ్

రాహుల్ ద్రవిడ్ యజమానిలానే వ్యవహరిస్తున్నాడు: కోచ్ విక్రమ్ రాథోడ్

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ పేరు వినగానే సాధారణంగా ఓ కోచ్‌గానే గుర్తొస్తాడు. కానీ ద్రవిడ్ ప్రస్తుతం యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో డబ్లిన్ గార్డియన్స్ ఫ్రాంచైజీకి సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఆ జట్టు కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోడ్ ద్రవిడ్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లోనూ విక్రమ్ రాథోడ్.. ద్రవిడ్‌తో కలిసి పని చేసిన సంగతి తెలిసిందే.

'ఎప్పుడూ కోచ్‌గానే చూస్తే ద్రవిడ్‌ను ఇప్పుడు యజమాని హోదాలో చూడటం భిన్నంగా అనిపిస్తోంది. ద్రవిడ్ కూడా ఓనర్‌లానే వ్యవహరిస్తున్నాడు. ఏ విషయాల్లోనూ పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. అదే మంచిది కూడా. ఇంతకుముందు కోచ్‌గా చాలా కాలం పనిచేసిన వ్యక్తి కాబట్టి జట్టు పరిస్థితులు ఎలా ఉంటాయో, ఫలితాలు ఎలా మారుతాయో అతడికి బాగా తెలుసు. అందుకే టోర్నీ ఆరంభంలో మేం వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయినా ఆయన మాకు ఎంతో మద్దతుగా నిలిచాడు. రాహుల్ నుంచి ఇలాంటి సహకారమే ఆశిస్తాం' అని రాథోడ్ వెల్లడించాడు.

ఆ వ్యవహారాలన్నీ అశ్విన్‌వే!

డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు భారత మరో క్రికెట్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వం వహిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికీ.. జట్టు క్రికెట్ వ్యవహారాల్లో మాత్రం అశ్విన్ కీలక పాత్ర పోషిస్తున్నాడని రాథోడ్ వెల్లడించాడు. ప్రత్యర్థి జట్లపై వ్యూహాలు రూపొందించడం, ఆటగాళ్ల ఎంపికతో పాటు రోజువారీ క్రికెట్ వ్యవహారాలను ఎక్కువగా అశ్వినే చూసుకుంటున్నాడని తెలిపాడు. యజమానిగా ఉన్న ద్రవిడ్ ఈ నిర్ణయాల్లో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశాడు.

'అశ్విన్‌కు క్రికెట్‌, ఆటగాళ్లపై అపారమైన పరిజ్ఞానం ఉంది. అతడిని క్రికెట్ పిచ్చోడని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్నీ క్రికెట్ మ్యాచ్‌లనూ చూస్తాడు. వివిధ దేశాల ఆటగాళ్ల గురించి అతడికి ఉన్న పరిజ్ఞానం అద్భుతం. కొన్ని సందర్భాల్లో పిచ్ పరిస్థితులు, ఆటగాళ్ల గురించి అశ్విన్‌కు ఇంత తెలుసా అని ఆశ్చర్యపోతుంటాను. అతడి లాంటి వ్యక్తి జట్టులో ఉండటం మాకు ఎంతో ఉపయోగకరం. నా కెరీర్‌లో ఎక్కువ సమయం భారత క్రికెట్‌లోనే గడిచింది. అందుకే ఇక్కడి పరిస్థితులు, ఆటగాళ్లు నాకు కొత్త. కానీ అశ్విన్ ఉండటం వల్ల నా పని చాలా సులువైంది' అని విక్రమ్ రాథోడ్ వివరించాడు.

strong>

తిలక్ వర్మపై రివేంజ్ తీర్చుకున్న వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్

చిన్న భాగస్వామ్యాలే ఇలాంటి పిచ్‌పై కీలకం: హర్మన్‌ప్రీత్ కౌర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy