Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాహుల్ గాంధీపై బీజేపీ నేతల ఫైర్.. 'ఇది నీచమైన చర్య' అంటూ విమర్శలు

రాహుల్ గాంధీపై బీజేపీ నేతల ఫైర్.. 'ఇది నీచమైన చర్య' అంటూ విమర్శలు

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. 'ఛాత్రోంకీ గూంజ్' కార్యక్రమానికి సంబంధించిన వీడియో బీజేపీ నేతల ఆగ్రహానికి దారి తీసింది.

ఇండోర్‌లో శనివారం జరిగిన ఆ కార్యక్రమంలో ఓ విద్యార్థి రాహుల్ గాంధీతో వేదిక పంచుకుంటూ.. నరేంద్ర మోదీని అనుకరించారు. అనంతరం మోదీని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇందులో వీరి వ్యాఖ్యలు, హావభావాలు ప్రధానిని కించపరిచేలా ఉన్నాయని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. రాహుల్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

రాహుల్ గాంధీ పరిధి దాటి మోదీ వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేశారని బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రధానిపై, ఆయన తల్లిపై అసభ్య వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా స్పందించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆయన 'నీచమైన చర్య'గా పేర్కొన్నారు. ప్రధాని మోదీని, ఆయన తల్లిని అవమానించడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. పెద్దలు, తల్లిదండ్రులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం నిజమైన భారతీయులకు రాదని ఫైరయ్యారు. ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత దాడి మార్గం కాదని ప్రహ్లాద్ జోషి ధ్వజమెత్తారు.

ఈ వివాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందిస్తూ.. రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ప్రధాని తల్లిపై ద్వేషపూరిత కామెంట్లు చేయడం క్షమించరాని తప్పని విమర్శించారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ వివాదంపై తీవ్రంగా స్పందించారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy