Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ను విరమించుకోవాలి

రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ను విరమించుకోవాలి

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : లోక్‌ సభ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై ఉత్తరాఖండ్‌ బీజేపీ ప్రభుత్వం అక్ర మంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే విరమిం చుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

మంగళవారం జిల్లా కేం ద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద ధర్నా చేప ట్టారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ మాట్లాడారు. ఉత్త రాఖండ్‌ రాష్ట్రంలో బహిరంగ సభ వేదికపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించాక బీజేపీ, ఆర్‌ ఎస్‌ఎస్‌ శ్రేణులు గంగాజలంతో శుద్ధి చేయడం హేయ మైన చర్యగా లౌకిక వాదులు ఖండించారన్నారు.

కులవివక్షను తీసుకొచ్చి వేదికపై శుద్ధి కార్యక్రమాలను నిర్వహించి జాతీయ దళిత నాయకుడిని అవమానించిన వారిపై చట్టరీత్యా ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ ప్రకారం కేసులు పెట్టాలని లోక్‌సభ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేసి ఉత్తరాఖం డ్‌కు వెళ్లారన్నారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ కు తంత్రవాదులు కలిసి కుల వివక్షకు పాల్పడిన వ్యక్తులపై ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేయకుండా ఉల్టా రాహుల్‌ గాంధీపైనే ఎఫ్‌ ఆర్‌ఐ చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వేదికపై శుద్ధి కార్యక్రమాలను నిర్వహించిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి రాహుల్‌గాంధీపై పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ను విరమింప జేసి బహిరంగంగా రాహుల్‌ గాంధీకి బీజేపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ రాజ న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్‌, జిల్లా ప్రధాన కార్య దర్శి రాగుల జగన్‌, జిల్లా కార్యదర్శి చొక్కాల రాము, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, మహిళ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రియాజ్‌, కౌన్సి లర్‌ లింగంపల్లి గంగరాజు, నాయకులు మంగ కిరణ్‌, ఇప్పపూ ల లక్ష్మణ్‌, గుజ్జె రమేష్‌, శ్రీగాధ మైసయ్య, రోజా, పలు మండ లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy