Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాహుల్‌ పౌరసత్వ పిటిషన్‌ కొట్టివేత

రాహుల్‌ పౌరసత్వ పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బ్రిటిష్‌ పౌరుడంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు తిరస్కరించింది. పిటిషనర్‌ తన ఆరోపణలకు తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయారంటూ లఖ్‌నవ్‌ బెంచ్‌ పేర్కొంది.

రాహుల్‌ గాంధీ బ్రిటన్‌లో ఓ కంపెనీని పెట్టారని, ఆ సందర్భంగా తనను తాను ఆయన బ్రిటిష్‌ పౌరుడినంటూ ప్రకటించుకున్నారని.. ఈ మేరకు ఆయనకు ఉన్న భారత పౌరసత్వాన్ని, ఎంపీ పదవిని రద్దు చేయాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అయితే రాహుల్‌పై ఆరోపణలకు సంబంధించిన అంశం ఇప్పటికే కేంద్రం వద్ద పరిశీలనలో ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy