హైదరాబాద్: రాజకీయంగా ప్రత్యర్థులు ఉంటారని, శత్రువులు ఉండరని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఈ వేడుకలో వారూ, వీరూ అనే బేధం లేకుండా అన్ని పార్టీల వారిని పిలిచి నిజమైన దసరా స్ఫూర్తిని తెలంగాణ ప్రజలకు బండారు దత్తాత్రేయ గుర్తు చేస్తున్నారని కొనియాడారు.

