Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజస్థాన్‌ పారిశ్రామికవేత్తపై ఐటీ పంజా

రాజస్థాన్‌ పారిశ్రామికవేత్తపై ఐటీ పంజా

- 15 చోట్ల ముమ్మర తనిఖీలు

చెన్నై: స్థానిక షావుకారుపేటలో నివసిస్తున్న రాజస్థాన్‌కు చెందిన పారిశ్రామికవేత్త నివాసాలు, కార్యాలయాలు, గోదాములు న్న 15 ప్రాంతాల్లో ఆదాయపు పన్నుల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

షావుకారుపేట స్టార్టన్‌ ముత్తయ్య వీథిలో నివసిస్తున్న రాజస్థాన్‌కు చెందిన పరాస్‌జైన్‌ అనే పారిశ్రామికవేత్త కర్పూరం తయారు చేసే కర్మాగారాన్ని నడుపుతున్నారు. చెన్నై సహా అన్ని నగరాలకు కర్పూరాన్ని టోకుగా సరఫరా చేస్తున్నారు. కొన్నేళ్లుగా పరాస్‌జైన్‌ పన్నుల ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు రావటంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగి గురువారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు. షావుకారుపేటలోని ఆయన నివాసాలు, గోదాములు, వేప్పేరిలోని కార్యాలయం, అన్నానగర్‌లోని కార్యాలయం సహా 15 చోట్ల ఒకే సమయంలో 60 మందికిపైగా అధికారులు, సాయుధ పోలీసులతో ఈ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పరాస్‌జైన్‌ నివాసం, కార్యా లయాల నుంచి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, కీలకమైన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో పరాస్‌ జైన్‌ కర్పూరం తయారీకి సంబంధించిన ముడిసరకులను విదేశాల నుంచి దిగుమతి చేసి సుంకం కూడా చెల్లించలేదని గుర్తించారు. ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy