Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజీనామా కోరలేదు.. అధిష్ఠానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నా: కొండా సురేఖ

రాజీనామా కోరలేదు.. అధిష్ఠానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నా: కొండా సురేఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు.

ఇందులో భాగంగా ఈరోజు(బుధవారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సురేఖ మాట్లాడుతూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదని అన్నారు. అధిష్ఠానం ఏం చేస్తుందో వేచిచూస్తున్నట్లు తెలిపారు. రాజీనామా చేయాలని తనను కోరలేదని చెప్పారు.

బీసీ అయిన తనకు ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయం పాటిస్తారా అని కొండా సురేఖ ప్రశ్నించారు. కేబినెట్‌లో ఉన్న ఇతర సామాజికవర్గాల నేతలపై పెద్దఎత్తున అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారని.. ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడిగారు. అన్ని అంశాలపై ఇప్పటికే ఖర్గే, రాహుల్‌, ప్రియాంక సహా అధిష్ఠాన పెద్దలందరికీ రాతపూర్వకంగా తెలియజేసినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌పై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదేళ్లు తానే సీఎం అని రేవంత్‌ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఖర్గేకు చెప్పినట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy