Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామ మందిరానికి రూ.4 కోట్ల విరాళం.. అకౌంట్లో మాత్రం రూ.3!

రామ మందిరానికి రూ.4 కోట్ల విరాళం.. అకౌంట్లో మాత్రం రూ.3!

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చిన రూ.4 కోట్ల బ్యాంకు చెక్ బౌన్స్ అయిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. చెక్ ఇచ్చిన మహిళ అకౌంట్లో కేవలం రూ.3 ఉన్నట్టు తెలిసింది.

చెన్నైకి చెందిన ఓ మహిళ ఈ చెక్కు ఇచ్చింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ఆమెకు నోటీసులు జారీ చేసేందుకు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సిద్ధమతున్నట్టు సమాచారం.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, మహిళ అప్పటికే రామమందిరానికి రూ.10 వేల విరాళం ఇచ్చింది. ఇక తాను ఇవ్వనున్న రూ.4 కోట్ల విరాళాన్ని సిబ్బంది సౌకర్యాల కల్పనకే వినియోగించాలని కూడా మహిళ షరతు విధించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ట్రస్టు మాత్రం అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మహిళతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు ట్రస్టు వర్గాలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదంతంపై ట్రస్టు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

రామ జన్మభూమి నిర్మాణానికి సంబంధించి 2020లో నిధి సమర్పణ్ అభియాన్ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో కేవలం 45 రోజుల్లోనే రూ. 3,500 కోట్ల విరాళాలు అందాయి. ఇక రామ మందిరానికి నెలనెలా రూ.3-4 కోట్ల వరకూ విరాళాలు వస్తుంటాయి. వీటిలో చెక్కు రూపంలో వచ్చే విరాళాలు రూ.1.5 కోట్ల వరకూ ఉంటాయి.

ఈ వార్తలనూ చదవండి:

కిర్గిస్థాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. 'భారత్ మాతా కీ జై' నినాదాలతో హోరెత్తిన పరిసరాలు..

సింగర్ హత్య కేసు.. ఎన్‌కౌంటర్‌లో అనుమానిత షూటర్ల హతం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy