Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామగుండం నవ నిర్మాణానికి కృషి

రామగుండం నవ నిర్మాణానికి కృషి

ళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు.

వెయ్యి రోజుల ప్రజాపాలన సందర్భంగా కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు బొంతల రాజేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే హాజరుకాగా ఘన స్వాగతం పలికారు. ప్రధానచౌరస్తా నుంచి శివాజీనగర్‌, రీగల్‌షూమార్ట్‌, కళ్యాణ్‌నగర్‌, సిటీస్కాన్‌, డాక్టర్స్‌ స్ర్టీట్‌, లక్ష్మీనగర్‌, ఓల్డ్‌ అశోక థియేటర్‌ మీదుగా ప్రధాన చౌరస్తాకు ర్యాలీ చేరుకుంది. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళుతున్నామని చెప్పారు. రూ.900కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని, క్యాథ్‌ల్యాబ్‌, ఎస్‌టీపీ, ఆర్‌జీఎఫ్‌ నిర్మాణాలు, నర్సింగ్‌ కాలేజీ, గోదావరిఖని జనరల్‌ ఆసుపత్రిలో ఐదు అంతస్థుల భవనం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నట్టు చెప్పారు.

అభివృద్ధిపై అవగాహన లేకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని, ఒకసారి వీధుల్లోకి వచ్చి జరుగుతున్న అభివృద్ధిని చూస్తే వాస్తవం అర్థమవుతుందన్నారు. ప్రజలకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. మేయర్‌ మహంకాళి స్వామి, సీనియర్‌ నాయకులు కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవికుమార్‌, దీటి బాలరాజు, తిప్పారపు శ్రీనివాస్‌, కార్పొరేటర్లు దూళికట్ట సతీష్‌, కౌటం సతీష్‌, ఫజల్‌బేగ్‌, సాగి సంతోష్‌రావు, ముస్తాఫా, గట్ల రమేష్‌, నెలికంటి రాము, చిదురాల నాగరాజు, తిప్పారపు మానస, కంకణాల మౌనిక, కొలని కవిత, కన్నూరి భాగ్యలక్ష్మి, నాయకులు మెంటం ఉదయ్‌రాజ్‌, దాసరి విజయ్‌ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy