ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
రామతీర్థం ఘటన జగన్ పాలనపై తిరుగుబాటు

ప్రభుత్వ పతనం ఖాయం.. కళాను కలిసిన ఉత్తరాంధ్ర నేతలు
ఆయన అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): మాజీ మంత్రి కళా వెంకట్రావుపై తప్పుడు కేసు పెట్టి, అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళనలు జరిపాయి. జాతీయ నాయకుల విగ్రహాల వద్ద ధర్నాలు నిర్వహించాయి. మహాత్మాగాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేసి, వినతి పత్రాలు అందజేశారు. ఉత్తరాంధ్రకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు శ్రీకాకుళం జిల్లా రాజాంలోని కళా వెంకట్రావు ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు. దాదాపుగా గురువారం ఉదయం నుంచి నేతలు, కార్యకర్తల రాకతో రాజాంలోని 'కిమిడి' ఇల్లు సందడిగా మారింది. రాజాం బయలుదేరిన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
కళా వెంకట్రావు నివాసం వద్ద పలువురు నేతలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ''రాముడి సాక్షిగా, రామతీర్థాల సంఘటన సాక్షిగా వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై జరిగిన దాడి... దాడి కాదు. అది సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు ప్రారంభించిన తిరుగుబాటు. రాష్ట్రంలో కొనసాగుతున్న జగన్ రాక్షస పాలన పతనం అయ్యే వరకూ ఈ తిరుగుబాటు కొనసాగుతుంది'' అని టీడీపీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నియోజకవర్గాల ఇన్‌చార్జిలు కూన రవికుమార్, కిమిడి నాగార్జున, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామ్‌మల్లిక్ నాయుడు అన్నారు. విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడారు. ''క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణుల్లో భయం సృష్టించడానికే కళా లాంటి టీడీపీ నాయకులను అరెస్టు చేస్తున్నారు. 69 ఏళ్ల వయసులో ఉన్న ఆయనను రాత్రిపూట అరెస్టు చేశారు. ఆయన చేసిన తప్పేమిటో చెప్పాలి'' అని డిమాండ్ చేశారు.
అరెస్టులు చేసినా పోరాటం ఆపం: కళా
శ్రీకాకుళం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): దేవుని కోసం చేస్తున్న పోరాటం ఆపేదిలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని విమర్శించారు.
related stories
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు గెలిపిస్తే అన్నక్యాంటీన్లు ఓపెన్ చేస్తాం: చంద్రబాబు
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు త్వరలో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం: పవన్
-
తాజా వార్తలు మార్పు కోసమే భాజపాతో పొత్తు: పవన్