ఇంటర్నెట్ డెస్క్: యోగాగురువు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'ఆయన (రామ్‌దేవ్) నా బెడ్‌రూమ్‌లో గబ్బిలంలాగా వేలాడుతున్నారా' అని ప్రశ్నించారు.
గతంలో నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులను కంగన విమర్శించిన విషయం తెలిసిందే. నిరసనకారులను జనరేషన్ గట్టర్(అంటే మురికి తరమని అర్థం) అని దూషించారు. అయితే ఈ వ్యాఖ్యలపై వివాదం రేగడంతో ఆమె సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో కంగన వ్యాఖ్యలపై రామ్‌దేవ్ బాబా ఘాటుగా స్పందించారు. యువతను జనరేషన్ గట్టర్ అనడానికి ఆమె అర్హతేంటని ప్రశ్నించారు. కంగన జీవితం ఎలాంటిదో అందరికీ తెలుసని మండిపడ్డారు. అలాంటి వారి గురించి మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నారు. రామ్‌దేవ్ విమర్శలకు తాజాగా కంగన కౌంటర్ ఇచ్చారు.
'నా జీవితం గురించి, నా వ్యక్తిత్వం గురించి రామ్‌దేవ్‌కు ఎలా తెలుసు? ఆయన నా బెడ్‌రూమ్‌లో గబ్బిలంలాగా వేలాడుతూ ఈ విషయాలు గమనిస్తున్నారా?' అంటూ ఆమె సెటైర్లు వేశారు. యోగాగురువు నుంచి వ్యాపారవేత్తగా మారిన ఆయన తనకు వ్యక్తిత్వం నేర్పకూడదని ధ్వజమెత్తారు. సనాతన ధర్మంతో మొదలై పక్కా వ్యాపారిగా రామ్‌దేవ్ బాబా మారిపోయారని విమర్శించారు. ఆయుర్వేద మందులు అమ్మే స్థాయి నుంచి లోదుస్తులు అమ్మే స్థాయికి ఆయన వ్యాపారం దిగజారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా గతంలో రామ్‌దేవ్‌కు సంబంధించిన పతంజలి సంస్థపై కంగన కోర్టులో కేసు కూడా వేశారు. ఆ సంస్థ ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

