బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా చేతిలో ఏడు సినిమాలున్నాయని తెలుస్తోంది. ప్రతిరోజూ పండగే తర్వాత తెలుగులో కాస్త గ్యాప్ వచ్చినప్పటికి ఈ గ్యాప్‌ను తమిళ, మలయాళ సినిమాలతో భర్తీ చేస్తోంది. 'ఇమైకనొడిగళ్' సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమయిన ఈమె మొదటి సినిమాతోనే హిట్ అందుకొని వరసగా కొత్త ప్రాజెక్ట్స్ కమిటయింది. ప్రస్తుతం రాశి చేతిలో 'అరణ్మనై-3', 'మేధావి', 'తుగ్లక్ దర్బార్', 'సర్దార్', 'సైతాన్ క బచ్చా' సినిమాలతో పాటు తెలుగులో అక్కినేని నాగ చైతన్యతో చేస్తున్న 'థాంక్యూ', గోపీచంద్‌తో 'పక్కా కమర్షియల్; సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవన్నీ వచ్చే ఏడాదికి గాని పూర్తి కావని తెలుస్తోంది.

