హైదరాబాద్, ఏప్రిల్ 26: జనగణన కీలకమైన జాతీయ కార్యక్రమం అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో జనగణన- 2027 స్వీయ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణన అనేది ప్రణాళిక, సుపరిపాలన, వనరుల పంపిణీకి పునాది అని పేర్కొన్నారు. కచ్చితమైన సమాచారం, లక్షిత సంక్షేమ పథకాల రూపకల్పనలో.. దేశ పురోగతి అంచనాలో ఈ జనగణన కీలకమని ఆయన తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనగణన ఇది అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గుర్తు చేశారు. స్వీయ గణన ప్రగతిశీలమైన వ్యవస్థకు ఆదర్శమని చెప్పారు. ఈ జనగణనలో అంతా పాల్గొనాలని ఈ సందర్భంగా ప్రజలకు గవర్నర్ పిలుపునిచ్చారు.
ఇంధన సరఫరాలో ప్రజలకు వాస్తవాలు చెప్పండి: మంత్రి నాదెండ్ల
కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి.. కవితకు లేదు: మల్లు రవి
For More TG News And Telugu News

